TRINETHRAM NEWS

Jubilee celebrations in Chakali Ailamma circle with distribution of sweets

మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడం రజక జాతి గర్వించదగ్గ విషయం కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ పెద్దపల్లి జిల్లా మరియు రజక సంఘం

చాకలి ఐలమ్మ సర్కిల్లో ఘనంగా జయంతి వేడుకలు స్వీట్లు పంపిణీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పట్టణ రజక టేలా అసోసియేషన్ అధ్యక్షులు బండి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రజక టేలా అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించి స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం పెండ్యాల మహేష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం కొంగు నడుముకు చుట్టి ఆత్మగౌరవ ప్రతీక ఎగురవేసి దొరల అహంకార నికి వ్యతిరేకంగా పోరాటం చేసి సాయుధ పోరాటానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మ చరిత్రను 10 సంవత్సరాలు దొరల ప్రభుత్వం విస్మరించినప్పటికీ ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గం
శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సహకారంతో మహిళా యూనివర్సిటీ కి ఐలమ్మ పేరు పెట్టడం గర్వించదగ్గ విషయమని ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం సంతోషకరమని తప్పకుండా రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రజక అభివృద్ధి కొరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనీచేయాలని అదేవిధంగా గోదావరిఖని కోర్టు దగ్గర చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద గోదావరిఖని బస్తీ పెద్దమనుషులు పెద్దపల్లి జిల్లా రజక సంఘం జేఏసీ ఆధ్వర్యంలోనే ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా టేలా అసోసియేషన్ అధ్యక్షులు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు పెండ్యాల మహేష్ పెద్దపల్లి జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి కొండపర్తి సంజీవ్ రజక టేల అసోసియేషన్ అధ్యక్షులు బండి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్ ముఖ్య సలహాదారులు వడ్లూరి దేవయ్య ఉపాధ్యక్షులు పైడి రాజయ్య జిల్లా సలహాదారులు దావనపల్లి రాజేశం రాష్ట్ర కార్యదర్శి దుర్గాప్రసాద్ అసోసియేషన్ నాయకులు ముఖ్యర శ్రీనివాస్ పసునుటి సంపత్ తోటపల్లి శ్రీనివాస్ నాంపల్లి సమ్మయ్య నగునూరి రాజేశం రామడుగు రాములు బిజిగిరి వెంకటరాజ్యం బండి రాములు కటుకూరు శ్రీనివాస్ బిజిగిరి రవి మామిడి అశోక్ మామిడి మహేందర్ కొత్తపల్లి దేవేందర్ జనగాం కనకయ్య అధిక సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు రజక కుల బాంధవులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jubilee celebrations in Chakali Ailamma circle with distribution of sweets