TRINETHRAM NEWS

జనవరి 4 నుంచి ‘జయహో బీసీ’

AP: YCP పాలనలో BCలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు జనవరి 4 నుంచి ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ‘జయహో బీసీ’ రెండు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. తొలి విడతలో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటిస్తామని చెప్పారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలోనే బీసీల కష్టాలు తెలుసుకుంటామని లోకేశ్ తెలిపారు.