
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్:దళిత వాడలో పుట్టిన దరిద్రాన్ని చవిచూసిన అస్పృశ్యునిగా చూసిన పలుకమ్మ ఓ విజయమ్మా!
ఊరికి చివర గుడిసే బడిలో ఓ మూలన బ్రతుకే భారమైన వేళ పలుకమ్మ ఓ విజయమ్మా!
పేదింటి పేరుమాళ్ల పెన్నిధి ఎక్కడిదీ అంటరానితనం ఎవరిది దొరతనం దిక్కారం పలుకమ్మ ఓ విజయమ్మా !
శూద్రుడు అని జాతి భేదం హీన కులమనే తారతమ్యం వెట్టిచాకిరి బానిసత్వం పలుకమ్మ ఓ విజయమ్మా
ఈభానిస సంకెళ్ళు తెంచుటే ఇక చదివే దానికి రహదారి ఊరి బడి గదిలో చివరన పలుకలమ్మ ఓ విజయమ్మా!!
ఊరు దాటి పట్నమే ఏగి పై చదువులెన్నో చదివి దేశ విదేశాలు ఎన్నోతిరిగి పలుకమ్మ ఓ విజయమ్మా !!
న్యాయ శాస్త్రాలెన్నో చదివి పలుదేశ న్యాయాన్నే వడపోసి న్యాయబద్ధ రాజ్యాంగ రూప కీర్తి పలుకమ్మ ఓ విజయమ్మా !!
రిజర్వేషన్లు ఎన్నో కల్పించే చట్టాలు ఎన్నో తెచ్చే ఆర్టికల్స్ ఇన్ నో రాసే పలుకమ్మ ఓ విజయమ్మా!!
నేడాయేధళితుందరికీ దేవుడు నిరక్షరాస్యులంతా అక్షరాస్యులు చదువులమ్మ ఒడి లో ఓనమాలు పలుకమ్మ ఓ విజయమ్మా!!
దిద్దిన అక్షరాలే డిగ్రీ పట్టాలై అవే మా ఉపాధి మార్గాలై రేపటి భావి తరాలవారమని పలుకమ్మ ఓ విజయమ్మా!!
నీ చదువు నీ రాజ్యాంగం మా ధైర్యం మా వెలుగు ఉద్యోగం శోధన రాజకీయం పలుకమ్మ ఓ విజయమ్మా !!
నేడు అన్నింటా మీ మై నీ బాటలో వారసుల మై రేపటి తరాలకు వారదులమై పలుకమ్మ ఓ విజయమ్మా!!
రచన విజయలక్ష్మి పున్న టీఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. హైదరాబాద్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
