
ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం డుంబ్రిగూడ ఏప్రిల్ 6: అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువేలి నియోజకవర్గం, డుంబ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీ, పెదపాడు గ్రామంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన పి.ఏం.జన్మత్ స్కీం రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వంపూరు గంగులయ్య పిలుపునిచ్చారు. ముందుగా గిరిజన సంప్రదాయాలతో, గంగులయ్య కి ఘనంగా ఆహ్వానం పలికారు. గంగులయ్య మీడియా తో మాట్లాడుతూ ఈ నెల 7వ తారీఖునా పవన్ కళ్యాణ్, అరకు నియోజకవర్గం కొన్ని గ్రామాల సందర్శనకు విచ్చేస్తున్నారు.
డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం, అదే విధంగా డుంబ్రిగూడ మండలం లో సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ సభలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 7వ తారీఖు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అధికారులు, జనసేన శ్రేణులు కార్యక్రమం విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నామన్నారు.అదే విధంగా జనసేన పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కి గిరిజన ప్రాంతం అంటే అపారమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయని, గిరిజన ప్రాంతం, గిరిజన కళలు, గిరిజన సంప్రదాయాలు మీద పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ప్రేమ అభిమానాలు ఉన్నవి, ప్రతి రెండు నెలలకు ఒకసారి గిరిజన ప్రాంతనికి వస్తున్నారు అంటే అది గిరిజన ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నామని, అందుకే మా గిరిజన ప్రాంత ప్రజల తరుపున మా తరుపున పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటక్ట్ చెట్టి. చిరంజీవి, జిల్లా కార్యదర్శి. ముల్లంగి. శ్రీనివాస్ రెడ్డి, డంబ్రిగూడ మండల అధ్యక్షులు సీదరీ. దనేశ్వరరావు, హుకుంపేట మండల అద్యక్షులు. బలిజ. కోటేశ్వరరావు పడాల్, డంబ్రిగూడ ప్రధాన కార్యదర్శి బిసాయి. మల్లికార్జున్, రమణ మూర్తి, అరకు నియోజకవర్గం నాయకులు సమర్డి రఘునాథ్, అరమనైని చిన్న ఎక్స్ మధు సత్యానంద్, పాడేరు మండల నాయకులు మజ్జి.సంతోష్,డంబ్రిగూడ మండల జనసైనికులు పాంగి. పవన్ వంతల బలేశ్వరావు జనసేన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
