జగనన్న విద్యా దీవెన అమౌంట్ డిసెంబర్ 29
ఆంధ్ర ప్రదేశ్ లో జగనన్న విద్యా దీవెన పథకం కింద జూలై – సెప్టెంబర్ త్రైమాసికం ఫీజుల సొమ్మును డిసెంబర్ 29వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం లో డబ్బులను విడుదల చేయునట్లు ప్రకటించారు.
ఈ విద్యా దీవెన అమౌంట్ విద్యార్థులు మరియు తల్లుల జాయింట్ అకౌంట్లో జమ చేయనున్నారు. ఐతే ఈ జమ చేసిన అమౌంట్ ను వారం పది రోజుల్లో విద్యార్ధులు చదువుతున్న కాలేజ్ లకి చెల్లించాలని ప్రభుత్వం కోరింది.
ఈ అమౌంట్ ను మూడు వారల్లోపు కాలేజ్ లకు చెల్లించకపోతే తదుపరి విడతలో ఇచ్చే నగదును నేరుగా కాలేజ్ లకు ఇస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.