Jagan to London today
Trinethram News : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. షెడ్యూల్ ప్రకారం గురువారం లండన్‌కు వెళ్లాల్సి ఉంది. ఆయన ఇద్దరు కుమార్తెలు.. బ్రిటన్‌లో చదువుతున్న విషయం తెలిసిందే. వీరిలోపెద్ద కుమార్తె పుట్టిన రోజు ఈ నెలలోనే ఉంది. దీంతో ఆయన కుమార్తెలను చూసేందుకు బ్రిటన్‌కు వెళ్లాల్సి ఉందని.. నెల రోజుల కిందటే హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి అనుమతి తెచ్చుకు న్నారు. మొదట అనుమతి ఇవ్వద్దొని సీబీఐ తరఫున న్యాయ వాదులు కోర్టును కోరినా.. గతంలో బెయిల్ నిబంధనలు ఉన్నా.. ఆయన బ్రిటన్ సహా స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లి వచ్చారని పేర్కొన్న కోర్టు.. విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది.
దీంతో తాజా పర్యటనకు 20 రోజుల కిందటే కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే.. అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని, ఒక దేశానికి అని చెప్పి.. వేరేదేశం వెళ్లరాదని ఆంక్షలు విధించింది. ఇదేసమయంలో ఫోన్ నెంబర్లు, పాస్ పోర్టు వివరాలను కూడా పోలీసులకు చెప్పాలని.. బ్రిటన్‌లో ఎక్కడ ఉంటున్నదీ ఎక్కడెక్కడ పర్యటించేది కూడా వెల్లడించాలని పేర్కొంది. మొత్తానికి జగన్‌కు, ఆయన సతీమణికి కూడా విదేశాలకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు వారు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App