TRINETHRAM NEWS

JAC president Maram Jagadeeswar demanded to solve the problems of state employees

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ఎన్టిపిసి లో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు బొంకూరు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ హజరై మాట్లాడుతూ, ఉద్యోగులకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించట్లేదని, 5వేల వీఆర్వో లు , అంగన్వాడిలపై పని భారం అధికమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోనల్ వ్యవస్థ 317 జీవితం ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిపిఎస్ పెన్సన్ రద్దు చేయాలని అన్నారు. దసరా లోపు పెండింగ్ లో ఉన్న డిఏ వెంటనే ప్రకటించాలని రేవంత్ రెడ్డి సర్కార్ ను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముజీబ్, దారం శ్రీనివాస్ రెడ్డి, మేనేని సందీప్ రావు, ఈదుల ప్రవీణ్ కుమార్, దొంగరి చంద్రశేఖర్, లక్ష్మణరావు, కెపి రాజ్ కుమార్, స్వర్ణలత, రాజేష్, తదితర నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

JAC president Maram Jagadeeswar demanded to solve the problems of state employees