TRINETHRAM NEWS

J. Aruna, Additional Collector of Local Bodies, conducts the Group 1 Prelims examination strictly according to the rules

పెద్దపల్లి, జూన్ 07 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ను పక్కాగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా నోడల్ అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా పోలీస్ నోడల్ అధికారి, రీజనల్ కో-ఆర్డినేటర్ తో కలిసి జూన్ 9న నిర్వహించు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకై నియమించబడిన రూట్ ఆఫీసర్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ కి వివిధ స్థాయిలలో ఎవరెవరు ఏమేమి చేయాలి అనే అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పరీక్ష నిర్వహణ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే అంచనా వేసి వాటిని పరిష్కరించాలని, జిల్లాలో జూన్ 9న జరుగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పకడ్బందీ నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని అన్నారు.

పరీక్ష కంటే ఒకరోజు ముందు రూట్ అధికారులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు, పోలీస్ అధికారులు సంయుక్తంగా ప్రశ్నాపత్రాల తరలింపు రూట్ లను తనిఖీ చేయాలని సూచించారు. ఓఎంఆర్ షీట్ పై ముందుగానే అభ్యర్థి వివరాలు ప్రింట్ అయి వస్తాయని, వాటిని సంబంధిత అభ్యర్థులకే అందించేలా చూడాలని అన్నారు.

పరీక్షా కేంద్రం ప్రాంగణంలో, అదే విధంగా భవనం వద్ద ప్రతి 100 మంది అభ్యర్థులకు ఒక్కరు చొప్పున నియమించబడిన ఐడెంటిటీ అధికారులు, ప్రతి అభ్యర్థిని పూర్తి స్థాయిలో చెక్ చేయాలని, మహిళలను పరిశీలించేందుకు మహిళా సిబ్బంది, ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

పరీక్షా కేంద్రం ప్రాంగణంలోకి సెల్ ఫోన్ అనుమతి ఉండదని, అభ్యర్థులు ఎవరు సెల్ ఫోన్ తీసుకుని రావడానికి వీలులేదని , ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి సైతం సెల్ ఫోన్ అనుమతి ఉండదని సూచించారు.

అభ్యర్థుల బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునేందుకు వీలుగా బయో మెట్రిక్ అటెండెన్స్ కోసం ప్రత్యేక ఇన్విజిలేటర్ లను నియమించామని, ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాలని అన్నారు.

పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు ఒక రోజు ముందుగా వెళ్లి పరీక్షా కేంద్రాన్ని ధృవీకరించుకోవాలని, బయోమెట్రిక్ హాజరు నమోదు దృష్ట్యా 9 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, ఎట్టి పరిస్థతుల్లో 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని, అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు తో పాటు గుర్తింపు కార్డు, బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్ తీసుకొని రావాలని సూచించారు.

పరీక్ష ప్రారంభ సమయంలో లాంగ్ బెల్, ప్రతి అరగంట సమయానికి బెల్, చివరి 30 నిమిషాలు ఉన్నప్పుడు అలారం బెల్ మోగే విధంగా ఏర్పాట్లు చేయబడినవని, ఒంటి గంట కు పరీక్ష ముగుస్తుందని, పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు తప్పని సరిగా వెనక్కి తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పరీక్ష కేంద్రాన్ని చీఫ్ సూపరింటెండెంట్ అధికారి పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని, ప్రతి హాల్, ప్రాంగణం పూర్తిగా తనిఖీ చేయాలని తెలిపారు.
జూన్ 8న ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్, ఇన్విజిలేటర్ లు, సెక్యురిటి సిబ్బంది, ఐడెంటిటీ అధికారులు, ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించాలని అన్నారు.

ప్రతి పరీక్షా హాల్లో సీటింగ్ అరేంజ్మెంట్ కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రశ్నపత్రాల తరలింపు పోలీసుల పర్యవేక్షణలో జరుగుతుందని, ప్రతి అంశం సీసీ కెమెరాలో రికార్డు అయ్యే విధంగా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో డి.సి.పి.(అడ్మిన్) రాజు, రీజనల్ కో-ఆర్డినేటర్ డాక్టర్. కె. లక్ష్మీ నర్సయ్య , సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

J. Aruna, Additional Collector of Local Bodies, conducts the Group 1 Prelims examination strictly according to the rules