TRINETHRAM NEWS

స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా

చిలకలూరిపేట :స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి కు వైఎస్ఆర్సిపి పార్టీ సముచిత స్థానాన్ని కల్పించింది. దరీయా వలికు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవి లో పార్టీ నాయకులు నియమించారు. ఈ సందర్భంగా కేబి రోడ్డు లోని అమీనియా మసీదు వద్ద రాష్ట్ర పదవి పొందిన దారియా వలి కు మైనార్టీ నాయకులు పలువురు సన్మాన సభను ఏర్పాటు చేసి ఆయనను అభినందించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి దర్యావలీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 24 వేల కోట్ల రూపాయలు మైనారిటీ కోసం ఖర్చు చేశారని తెలిపారు. జగన్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని మీరు తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల నేడు ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం ప్రముఖులు పలువురు పాల్గొని దరియా వలి కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు నాయకులు షేక్ నాగూర్, 29వ వార్డు కౌన్సిలర్ యూసుఫ్ అలీ, 13 వార్డు కౌన్సిలర్ మీరాబి,కౌన్సిలర్ కరిముల్లా,నాదెండ్ల, ఎడ్లపాడు పోతవరం గ్రామాల నుండి భాష ,హుజూఫు, మస్తాన్వలి, అబ్బాస్ ఖాన్, మౌలాలి, రామకృష్ణ,మోహిద్దిన్, సైదా రెడ్డి, షరీఫ్ అనేకమంది మత పెద్దలు పాల్గొని దర్యావలికి అభినందనలు తెలియజేశారు.