TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా శుక్రవారం మంథని మండలంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో ఆయన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించా రు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు
గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వ లేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు 20 లక్షల మందిని రేషన్ కార్డులలో పేర్లు చేర్పించడం జరిగింద న్నారు.రూ.3 కోట్ల పది లక్ష ల మందికి సన్న బియ్యాన్ని ఇవ్వనున్నామని తెలిపారు
5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామని చెప్పారు. కనగల్ మండలంలో 20 ఏండ్ల కింద ఒక్కొక్కటి లక్ష రూపాయలతో తాను 500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చా మని ,ఇప్పుడు మళ్లీ ఐదు లక్షలతో ఇళ్లు కట్టిస్తామని చెప్పారు ఉచిత బస్సు, రైతు బీమా, రైతు భరోసా, ఎల్పీజీ కనె క్షన్ లను తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

IT Minister Sridhar Babu