TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కులం పేరుతొ స్పీకర్ను అవమాన పరిచింది స్వంత పార్టీయే
సర్పంచుల నేత రాజిరెడ్డి, దోమ. విభిన్న సంస్కృతులకు నిలయంగా జాతీయ బావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుల ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్ల మీదకు, వచ్చిప్రాంతీయ ప్రతి పక్ష పార్టీ బావాలు కలిగిన ఒక రాజకీయ పార్టీ పై నిరసన వ్యక్తం చేయడం దిష్టి బొమ్మలు, తగల బెట్టడం బహుశా ఇదే ప్రథమం కావొచ్చు అని సర్పంచుల సంగం నేత కె రాజిరెడ్డి అభిప్రాయపడ్డారు ఆదివారం పరిగి ప్రాంతం లోని పలు మండలాల్లో శాసన సభ స్పీకర్ నీ అగౌరవ పరిచారు అని అధికార పార్టీ తరుపున ప్రతి పక్ష నాయకుల దిష్టి బొమ్మల దహనం వింతగా ఉందన్నారు.

శాసన సభలో చర్చలో భాగంగా ఈ సభ ఎవరి స్వంతం కాదు అనే ఉచ్చారణలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి ఈ సభ మీ స్వంతం కాదు అని పోరపాటున అన్నందుకు సభ నుంచి మాజీ మంత్రి నీ సస్పెండ్ చేసిన సందర్బంలో చట్ట సభలో అధికార పార్టీ సభ్యులు కులం పేరు ప్రస్థావిస్తూ గౌరవ హోదాలో సౌమ్యూడిగా ఉన్న స్పీకర్ ప్రసాద్ కుమార్ ను అధికార పార్టీ శాసన సభ్యులు మంత్రులు ప్రసాద్ కుమార్ వ్యక్తిత్వన్ని నైపుణ్యాన్ని తక్కువ చేసి మాట్లాడం అధికార పార్టీ వారే అవమానపరిచారు అని రాజిరెడ్డి పేర్కొన్నారు. చట్ట సభలో జరిగే ప్రతి విషయాన్నీ అధికార పక్షం రోడ్ల మీదకు తీసుకు రావద్దని రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సూచించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

the ruling parties are