మెదక్ : కాంగ్రెస్ తరఫున మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. ఆశావహుల నుంచి ఆ పార్టీ అధిష్ఠానం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం విదితమే. శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. వీరిలో సిద్దిపేటకు చెందిన పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి శుక్రవారం అర్జీ సమర్పించగా, శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జలిగామకు చెందిన బండారి శ్రీకాంత్‌రావు, అక్బర్పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్‌కు చెందిన మద్దుల సోమేశ్వర్రెడ్డిలు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎవరెవరు అర్జీలు సమర్పించారనేది తెలియాల్సి ఉంది. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు టిక్కెట్టు ఆశిస్తున్నట్లు సమాచారం. మరో వైపు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సైతం బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ తరఫున మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ
TRINETHRAM NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్. కే గార్డెన్స్ లో శనివారం రోజున పెద్దపల్లి నియోజకవర్గనికి సంబంధించిన…
ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి
TRINETHRAM NEWS ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి *ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి *వైద్యులు విధి నిర్వహణ సమయంలో ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలి *రామగుండం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రామగుండం, జనవరి -18…