TRINETHRAM NEWS

Your’ services are frozen.. Issuance of certificates that have been stopped for ten days

డాటా కేంద్రంలో సాంకేతిక లోపం
నష్టపోతున్న విద్యార్థులు, ఉద్యోగార్థులు
Trinethram News : Telangana : హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో పది రోజులుగా సేవలు స్తంభించిపోయాయి.
దీంతో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర డాటా సెంటర్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్తున్నారు. డిజిటల్‌ తెలంగాణలో భాగంగా వివిధ రకాల ప్రభుత్వ సేవలను మీసేవ, ఈసేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్నది. 38 ప్రభుత్వ శాఖలకు చెందిన 200 వరకు సేవలు 2,856 మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెవెన్యూశాఖ నుంచి విద్యార్థులు, ఉద్యోగార్థులు పొందాల్సిన కులం, ఆదాయం, ఈడబ్ల్యూఎస్‌ తదితర సర్టిఫికెట్లు అతి ప్రధానమైనవి.

ప్రస్తుతం పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ జరుగుతున్నాయి. డిగ్రీ పూర్తిచేసినవారు వివిధ ప్రవేశ పరీక్షలకు హాజరు కావాలన్నా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవి ఎంతో అవసరం. ఉదాహరణకు, వచ్చే ఏడాది ఎంబీఏలో ప్రవేశాల కోసం ఐసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష కోసం పొడిగించిన గడువు కూడా ఈ నెల 20తో పూర్తవుతుంది. అలాగే, ఈ ఏడాది ఎంబీఏ ప్రవేశాల గడువు కూడా ఇటీవలే పూర్తయింది.

ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నుంచి వెలువడే పలు నోటిఫికేషన్లు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల అప్రెంటిషిప్‌ గడువు కూడా ఈ మధ్యనే ముగిసింది. కులం, ఆదా యం తదితర సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే వారికి ఫీజుల్లో రాయితీ లభించడమే కాకుండా ప్రవేశాల్లో కొంత కోటా వర్తిస్తుంది. పది రోజులుగా మీసేవ కేంద్రాల్లో సేవలు నిలిచిపోవడంతో వీటికి దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది అభ్యర్థులు నష్టపోయారు. విద్యార్థులు ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Your' services are frozen.. Issuance of certificates that have been stopped for ten days