TRINETHRAM NEWS

ఇంటరెస్టింగ్!.. టీడీపీ ఆఫీసులో అక్కినేని ఫామిలీ!

Trinethram News : అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా చేసుకుపోతూ ఉంటారు. కారణం ఏమిటో తెలియదు గానీ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో నాగ్ చాల ఫ్రెండ్లీగా ఉంటారు. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉండగా.. నేరుగా జైలుకి వెళ్లి మరీ నాగ్ ఆయనను పరామర్శించారు. నాడు ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. జగన్ తనకు మిత్రుడని… అలాగే జగన్ తో పాటు నాడు జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ కూడా తనకు మిత్రుడని కూడా నాగ్ చెప్పుకొచ్చారు.

సీన్ కట్ చేస్తే… శుక్రవారం నాగ్ తన ఫామిలీ మెంబెర్స్ తో కలిసి టీడీపీ కార్యాలయంలో కనిపించారు. అది కూడా ఢిల్లీలోని పార్లమెంటులో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళ్లిన నాగ్.. అక్కడ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను బైరెడ్డి శబరీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో నాగ్ తో పాటు ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, కోడలు శోభిత ఉన్నారు.

ఢిల్లీ లో అది కూడా పార్లమెంట్ లో…టీడీపీపీ కార్యాలయానికి నాగ్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లడం, అక్కడ టీడీపీ ఎంపీ కనిపించగానే.. ఫోటోలకు ఫోజులిచ్చిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ తో స్నేహం ఉన్నా ఏనాడూ నాగ్ వైసీపీ ఆఫీస్ కి వెళ్లిన దాఖలా లేదు. అయితే… ఢిల్లీ వెళ్లిన నాగ్ ఇలా టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయినా.. నాగ్ తన ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ ఎందుకు వెళ్లారని ఆరా తీస్తే… తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావుపై ఓ పుస్తకాన్నిఆవిష్కరించే కార్యక్రం ఉండటంతో… ఢిల్లీ వెళ్లిన నాగ్.. పనిలో పనిగా పలువురు రాజకీయ నేతలను కూడా కలిశారట. ఈ క్రమంలోనే.. నాగ్ ఆలా టీడీపీ ఆఫీస్ కి కూడా వెళ్లినట్టు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Akkineni family