
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 14: అరకువేలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా, డుంబ్రిగూడ మండలం అరకు పంచాయతీ అరమ గ్రామానికి చెందిన కొర్రా లైకొనుని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు పరామర్శించి, జరిగిన ప్రమాదము గురించి అడిగి తెలుసుకున్నారు.
తమకి ఉన్న కాపీ తోటలో మిరియాలు సేకరించడానికి, వెళ్లిన కొర్రా లైకొన్ నిచ్చెన జారిపోయి 17 అడుగుల చెట్టు నుండి కిందకి పడిపోవడంతో తీవ్ర దెబ్బలు తగిలాయి తలకి బలమైన దెబ్బ తగలడంతో పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజిహెచ్ కి తరలించారు. తలకు తగిలిన గాయానికి ఆపరేషన్ చేయవలసి ఉంటుందని వైద్యులు చెప్పడంతో నిరుపేద అయిన లైకోన్ తండ్రి గుండు ఆందోళన చెందుతున్నారు.
కొడుకు విగతజీవిలాగా మంచంలో పడి ఉండడాన్ని చూస్తూ తట్టుకోలేకపోతున్నారు. అలాగే అరకువేలి హట్టగుడ గ్రామానికి చెందిన గొల్లొరి సావిత్రి ( 25) మిరియాలు సేకరించడానికి వెళ్లి చెట్టు నుండి కిందకి పడిపోయారు. వెన్నుపూస కు బలమైన దెబ్బ తగిలి అరకువేలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్య పరికరాలు ఏరియా ఆసుపత్రిలో లేకపోవడంతో కేజీహెచ్ కి తరలించాలని వైద్యులు సూచిస్తున్నారు. తండ్రి లేని స్థానంలో తల్లితో కుటుంబ పోషణ కోసం అనేక కష్టాలు పడుతూ కాఫీ మిర్యాల తోటలను నమ్మి జీవిస్తున్నారు.
వ్యవసాయం ద్వారా ఆదాయం లేక కాఫీ సిల్వర్ తోటలను నమ్మి జీవనం సాగిస్తున్న కుటుంబాలు జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఏజెన్సీలో అనేకమంది ఈ రకమైన ప్రమాదానికి గురి అవుతున్నారు.
ప్రభుత్వం స్పందించి కాఫీ, మిర్యాల తోటల ఉన్న రైతులకు ఇన్సూరెన్స్ కల్పించి ప్రమాదం జరిగినప్పుడు తోట అగ్గిపాలైనప్పుడు కుటుంబాలకు ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.
కాఫీ మిరియాలు తోటలో ప్రమాదం జరిగి చికిత్సకి గురి అయిన కొర్రా లైకోన్ గొల్లోరి సావిత్రి లను మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
