Inspections on Sayileela Restaurant : సాయిలీల రెస్టారెంట్ పైన తనిఖీలు

TRINETHRAM NEWS

నాణ్యత లేని ఆహార పదార్థాలు వడ్డిస్తున్న సాయిలీల రెసిడెన్సీ మరియు హైకింగ్ ఫామిలీ రెస్టారెంట్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గురువారం రామగుండం నగర పాలక సంస్థ పదివేల రూపాయల జరిమానా విధించింది తనకు వడ్డించిన ఆహారం నాణ్యoగా లేదని ఒక వినియోగదారుడు నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణ కి గురువారం సాయంత్రం ఫోన్ ద్వారా సందేశం పంపించడంతో స్పందించిన ఆమె వెంటనే తనిఖీ చేయవలసిందిగా నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీకి వెళ్లిన నగర పాలక సంస్థ అధికారులు అక్కడ నాణ్యoగా లేని ఆహార పదార్థాలు గుర్తించి జరిమానా విధించారు. నగర పాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ నాయిని వెంకటస్వామి ఆధ్వర్యంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు నాగ భూషణం, సంపత్ , ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్ తదితరులు ఈ తనిఖీలు నిర్వహించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Inspections on Sayileela Restaurant

You cannot copy content of this page

Scroll to Top