
పార్ల్: దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. 297 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా జట్టులో జోర్జి(81) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా, మారక్రమ్(36) మినహా మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలరల్లో అర్ష్ దీప్ 4, వాషింగ్టన్ సుందర్ 2, అవేశ్ఖాన్ 2, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజు శాంసన్(108) శతకంతో అదరగొట్టగా, తిలక్ వర్మ(52) అర్ధశతకం చేశాడు.
