TRINETHRAM NEWS

అల్లూరు జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 3: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను పురస్కరించుకొని పార్లమెంట్ సమన్వయ కర్త,సాంస్కృతిక కమిటీ సభ్యులు గా నియమితులైన, వంపూరు గంగులయ్య, రాష్ట్ర పర్యావరణవేత్త జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, మరో సమన్వయ కర్త పి.ఆదినారాయణ రంపచోడవరం ఇంచార్జీ కుర్ల రాజా శేఖర్ రెడ్డి.

వివరాల్లోకి వెళితే, రంపచోడవరంలో జరిగిన సభా సన్నాహక సమావేశం కార్యక్రమాన్ని ఉద్దేశించి గంగులయ్య ప్రసంగిస్తూ జనసేన పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించి నేటికీ మార్చి 14వ తేదీతో 11సంవత్సరాలు పూర్తిచేసుకొని దిగ్విజయంగా 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో అందరూ ఐకమత్యమయ్యి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ జరిగేలా ఆటంకాలు లేకుండా చిత్త శుద్ధితో బాధ్యతగా నిర్వహించేలా అందరూ బాధ్యత గా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయవలసినదిగా పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ కుటుంబ సభ్యులు గా మనందరి బాధ్యత అని అందరూ క్రమశిక్షణతో, ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగేలా చూడాలని,అందరికీ ఇది ఒక పండుగ వాతావరణమని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చెయ్యాలని, కోరారు..అలాగే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిసిన వైసిపి అనే రాక్షస పాలనను అంతం అందించడానికి నిరంతరం కృషి చేసి ,టీడీపీ, బీజేపీ, పార్టీలతో జతకట్టి రాష్ట్రానికి పునర్వైభవం తీసుకొచ్చిన జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు , పవన్ కళ్యాణ్. సంకల్పం గొప్పదని, అందరూ ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను, ప్రజల దృష్టికి తీసుకెళ్లి, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి అందరూ సమిష్టిగా, కృషి చెయ్యవలసినదిగా కోరుచున్నాము అని అన్నారు..

అలాగే జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆయన వెంట ఉన్న యువత, వీరమహిళలే జనసేన పార్టీ బలం అని, మీరు చేసిన సేవ కార్యక్రమాలు జనసేన పార్టీ ఎప్పటికీ మరువలేనిదని, పవన్ కళ్యాణ్ . నిజాయితీకి మారుపేరుగా నిలిచిన జనసైనికులు ముక్త కంఠంతో పనిచెయ్యాలనీ, ప్రజలకు జనసేన పార్టీ యొక్క విది విధానాలు సిద్ధాంతాలు తెలియజేసి, స్వచ్చమైన పరిపాలన,సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీస్ సిబ్బంది వారికి, జనసేన పార్టీ నియమించిన కమిటీ సభ్యులకు వాలంటీర్లకు సహకరించి సభను విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము అన్నారు…

అలాగే పార్లమెంట్ సమన్వయ కర్త,సాంస్కృతిక విభాగం కమిటీ సభ్యులు గా నియమించినందున జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.. నా పై పెట్టిన నమ్మకానికి త్రీకరణ శుద్ధితో బాధ్యతతో 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం అయ్యేలా కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ,కె.స్వామి,ఏస్ శ్రీను,వివిధ మండలాల అధ్యక్షులు,నాయకులు వీరమహిళలు జనసైనికులు, జనసేన శ్రేణులు,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

preparatory meeting