TRINETHRAM NEWS

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

పేరాబత్తులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పిలుపు

42వ డివిజన్లో ముమ్మర ప్రచారం
Trinethram News : రాజమహేంద్రవరం : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం తధ్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరం విజయం కోసం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నగరంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ ను ఆయన ప్రత్యక్షంగా కలుసుకుని వారి మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖరానికి వేయాలని కోరుతున్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి ఆయన స్థానిక 42వ డివిజన్లో పరిశీలకులు బత్తుల తాతబాబు, బోళ్ల వెంకట కృష్ణ ప్రసాద్ తదితరులతో కలిసి పర్యటించి గ్రాడ్యుయేట్లను కలుసుకుని వారికి కరపత్రాలు, నమూనా బ్యాలెట్‌ పేపర్లు అందచేసి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన విజయానికి సహకారం అందించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరుగుతుందని పట్టభద్రులు ఆలోచన చేస్తున్నారన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులకు ఇచ్చిన అన్ని హామీలను నేరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

వారి వాణిని మండలిలో వినిపించి పట్టభద్రుల సమస్యలను దూరం చేసే సత్తా పేరాబత్తుల రాజశేఖరానికి ఉందన్నారు. అందుకే పేరాబత్తుల రాజశేఖరం పేరు ఎదుట 1 నెంబర్‌ వేసి ఆయనకు అఖండ విజయం చేకూర్చాలని గ్రాడ్యుయేట్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, స్థానిక టీడీపీ నాయకులు మళ్ల వెంకట రాజు, కేవీ శ్రీనివాస్, ఆడారి లక్ష్మీ నారాయణ, వానపల్లి శ్రీనివాస్, పేరూరి అంజి, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Adireddy Srinivas