సిద్దులూరు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిరాని వైద్యంతో అన్ని రోగాలకు చికిత్స
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
తనిఖీ చేయని సంబంధిత అధికారులు
వికారాబాద్ జిల్లా డిసెంబర్ 22 వికారాబాద్ మండల పరిధిలోని సిద్ధలూరు గ్రామంలో, మరియు ఆయా గ్రామాలలో సుమారుగా ఊరుకో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నట్లు మండల పరిధిలోని ప్రజలు తెలిపారు. వికారాబాద్ మండల పరిధిలోని ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్ఎంపీ డాక్టర్ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ఎంబిబిఎస్ డాక్టర్ దగ్గరికి కానీ పంపించాలి కానీ ప్రస్తుతం ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లు చిన్న వ్యాధి మొదలుకొని పెద్ద వ్యాధుల వరకు వాళ్లే వైద్యం చేస్తున్నట్లు కొంతమంది ప్రజలు ఆరోపించారు. అనారోగ్యం ఎక్కువై తీవ్ర దశకు దాల్చినప్పుడు మెరుగైన వైద్యం కోసం ఆర్ఎంపీ డాక్టర్ కు అనుకూలంగాఉన్న ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రజలకు వైద్యం పైన అవగాహన లేక డాక్టర్ చెప్పిందే వేదంగా నమ్ముతారు కాబట్టి వారు ఏమి చెప్పినా వినాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్ఎంపి డాక్టర్ వద్ద చికిత్స చేసుకుంటుండగా అనారోగ్యం కోల్పోకుండా పలుమార్లు ఆసుపత్రి చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపించారు. మండల కేంద్రంలోనే కాకుండా మండల పరిధిలో ఉన్న గ్రామాలలో కూడా ఆర్.ఎం.పి డాక్టర్లు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో సంబంధిత అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ ఆర్.ఎం.పి చేయాల్సిన చికిత్స కాకుండా ఎంబీబీఎస్ డాక్టర్ చేయాల్సిన చికిత్సను కూడా అందిస్తున్న సందర్భాలు లేకపోలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వికారాబాద్ మండల , పరిధిలో సిద్దులూరు గ్రామంలో ఉన్నటువంటి ఆర్.ఎం.పి డాక్టర్ చిన్నపిల్లలకు సైతం వైద్యం చేస్తున్నాడు. దేవుని తర్వాత నమ్మేది డాక్టర్ నే కాబట్టి నిజమైన డాక్టరు అందుబాటులో ఉండే విధంగా వైద్య సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని గ్రామాలలోని ప్రజలకు న్యాయం చేకూర్చాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App