TRINETHRAM NEWS

గంజాయి ముఠా రూట్‌ మార్చింది. నిన్నటి వరకు గంజాయి రూపంలో విక్రయం, కాని ఇప్పుడు చాక్లెట్ల రూపంలో అమ్మకం.
గతంలో హవారా బ్యాచ్, ఓ వర్గం టార్గెట్‌. కాని ఇప్పుడు స్కూల్, కాలేజ్ విద్యార్థులే లక్ష్యం.

వారికి చాక్లెట్ల రూపంలో అందించి, వ్యసనంగా మార్చి డబ్బులు సంపాదిస్తోంది గంజాయి ముఠా..

తాజాగా.. హైదరాబాద్, ఖమ్మంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. రెండు చోట్ల డ్రగ్స్ చాక్లెట్లతో సహా.. నిందితులను ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు.

హైదరాబాద్ కోకాపేటలో స్కూల్ విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న ముఠాకు చెక్ పడింది.

ఒరిస్సాకు చెందిన సోమ్యా రాజన్‌గా గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడి చేసి 40 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఓ అపార్ట్‌మెంట్‌లో కార్మికులకు అమ్ముతుండగా పట్టుకున్నారు. ఉపాధి కోసం ఒడిస్సా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సోమ్య రాజన్ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడు.

ఖమ్మంలో కూడా గంజాయి చాక్లెట్లు గుట్టురట్టయ్యింది. కాల్వొడ్డులో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారివద్ద నుంచి 3 కిలోల గంజాయి చాక్లెట్లు.. 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

విద్యార్థులే టార్గెట్‌గా గంజాయ్ చాక్లెట్లను డ్రగ్స్ ముఠాలు విక్రయిస్తున్నారు. పాన్‌షాపులు, కిరాణా దుకాణాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.