మానవ అక్రమరవాణా చట్ట రీత్యా నేరం….
దౌల్తాబాద్ ఎస్సై రవి కుమార్ గౌడ్….
అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం….
అక్షర విజేత దౌలతాబాద్
దౌల్తాబాద్. మానవ అక్రమ రవాణ చట్టరిత్య నేరమని దౌల్తాబాద్ మండల ఎస్సై రవికుమార్ గౌడ్ అన్నారు. మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని బుధవారం మండల పరిధిలోని గొకఫస్ల బాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు…..అక్రమ రవాణా అనేది చాలా నేరమని ఎవ్వరూ కూడా ఎవ్వరినీ నమ్మొదన్నారు. నమ్మి మోసపోయేవాల్లె ఎక్కువ ఉన్నారని అదికూడా అక్రమ రవాణా గా మారుతుందన్నారు. నమ్మించి బయటికి తీసుకెళ్ళి మోసం చేసి వదిలిపెట్టడం కూడా అక్రమ రవాణ గా పరిగణిస్తారు పేర్కొన్నారు. బ్రతుకుతెరువు కోసం మోసపూరిత మాటలు చెప్పి బయటికి తీసుకెళ్ళి శ్రమ దోపిడీ, శారీరిక దోపిడీ చేయడం అక్రమం అన్నారు. మార్కెట్లో వ్యాపారంలో కొనేవారు. అమ్మేవారు, వస్తువులు వున్నట్లుగానే మానవ అక్రమరవాణాలో మనుషులే వస్తువులుగా అమ్మకం చెంది మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యక్తులను బెదిరించి పని చేయించడం, బలవంతంగా పని చేయించడం కూడా చట్ట రీత్యా నేరమని సూచించారు. అదే విధంగా అధికారంతో సిబ్బందిని లేదా ఇతరులను అధికారం అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేయటం కూడా చట్టరీత్య మని పేర్కొన్నారు. తోటి సిబ్బందితో లేదా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం కూడా నెరమన్నారు. అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్తూ పిల్లలను, మహిళను, వ్యక్తులను అవహరించటం వంటి అంశాలు అక్రమ రవాణా కొరకు ప్రేరేపించటంలో భాగం అవుతుందని ఇది కూడా చట్ట ప్రకారం నేరమని తెలిపారు.
ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్న సమయంలో వెంటనే పోలీసులకు 100 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. అదే విధంగా గ్రామంలో బాల్య వివాహాలు జరుగుతున్న సంచారాన్ని , బాల కార్మికులుగా పని చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తె వెంటనే 1098 నంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అంకిత స్వచ్ఛంద సంస్థ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అంకిత స్వచ్చంధ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్, మండల కో ఆర్డినేటర్ వెంకటయ్య, పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు వెంకట్, ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఫొటోలు .
- అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్సై రవి కుమార్ గౌడ్.
- అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు.
- మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవ పోస్టర్ ను విడుదల చేస్తున్న ఎస్సై రవి కుమార్ గౌడ్, సంస్థ జిల్లా కో ఆర్డినేటర్.