
తేదీ: 09/01/2025.
తొక్కిసులాట ఘటనపై హోం మంత్రి దిగ్బ్రాంతి.
కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్ ) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో తేదీ : 08/01/2025 న అనగా బుధవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు టిక్కెట్ల
జారి సమయంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరం అన్నారు. దయ ఆసుపత్రి అత్య అవసర సేవల విభాగం వద్ద పరిస్థితులను అదుపు చేయాలని హోం మంత్రి అనడం జరిగింది. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించేలా చూడాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న చోట మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు.. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ప్రజలందరికి అండగా ఉంటుందని తెలపడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
