ఈ ప్రాంతం బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే చరిత్ర క్షమించదు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్‌కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలను పారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. “తెలంగాణ వచ్చి పదేళ్లవుతున్నా.పాలమూరు నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు” అని అన్నారు.
శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి స్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయంలో లక్ష్మీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.అంతకు ముందు శ్రీ కురుమూర్తి స్వామి ఆలయానికి రూ. 110 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినకార్యక్రమంలోమాట్లాడుతూ, ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.పాలమూరు జిల్లా వలసలకు మారుపేరు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ప్రజా ప్రభుత్వ భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూడొద్దు.వలసల నిరోధించడానికి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేసి పాడి పంటలతో విలసిల్లేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.
ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు.
అడ్డుకోవాలని చూసే వారిని పాలమూరు జిల్లా ప్రజలు క్షమించరు. అలాంటివారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. జిల్లాలో అమర్‌రాజా బ్యాటరీస్ కంపెనీలో 2 వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీ అంగీకరించింది.
ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినా ఈ ప్రాంతనిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిది.జిల్లాలో గ్రామ గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మాది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు.విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App