Heavy Rain : రాష్ట్రానికి ఐద్రోజుల పాటుభారీ వర్షసూచన

TRINETHRAM NEWS

పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీరాష్ట్రంలో బుధవారం 100కిపైగా ప్రాంతాల్లో వాన

Trinethram News : రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, పలు ప్రాం తాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరా బాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. వచ్చే మూడు రోజులకు సంబంధించి ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిజామాబాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.

పై జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. వచ్చే 48 గంటల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముంది. బుధవారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో 100కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లిలో అత్యధికంగా 7.65 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. నల్లగొండ, నాగర్కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షం పడింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heavy rain forecast for

You cannot copy content of this page

Scroll to Top