
Heartfelt tribute to Singareni ACMO
సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డివైసిఎంఓ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పదోన్నతి పొందిన సందర్భంగా
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని సీనియర్ న్యాయవాది వేల్పుల మురళీధర్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అందరితో నిత్యం చిరునవ్వుతో పలకరించి బాధితులను ఆప్యాయతగా అక్కున చేర్చుకునే డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ గారు పదోన్నతి పొందడం పట్ల శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాది ముస్కె రవికుమార్, డాక్టర్ విష్ణుమూర్తి, ఆఫీస్ సూపరిండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

Comments are closed.