
Trinethram News : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటులో సాధారణంగా బయట కనిపిస్తుంటారు. ఇంట్లో ఉన్న సమయంలో కాలర్ టీ షర్ట్స్ ధరిస్తారు. అయితే దావోస్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి సూటు, బూటులో నయా లుక్లో అదరగొట్టారు. మునుపెన్నడు తమ నేతను ఇలా చూడని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి లుక్కు ఫిదా అవుతున్నారు. ‘వావ్ అదిరిపోయింది సూట్’ అంటూ ఒకరు, ‘కింగ్లా ఉన్నారంటూ’ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇక, స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు జనవరి 15 నుంచి 18 వరకు జరగనుంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా వీరు ప్రపంచ దేశాల పారిశ్రామిక వేత్తలు, పెద్ద కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు.
