TRINETHRAM NEWS

కూకట్ పల్లి మార్చి 3 : బిఆర్ఎస్ యువ నాయకుడు నిమ్మల సంతోష్ రావు జన్మదిన వేడుకలను కార్యకర్తలు, అభిమానుల మధ్య సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంతోష్ రావు శాలువా కప్పి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కృష్ణారావు చేతుల మీదగా పారిశుద్ధ కార్మికులు, పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నిమ్మల సంతోష్ రావు కీలక పాత్ర పోషించి యువతను ప్రోత్సహించారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, బిఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు, మాధవరం రంగారావు, గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు, కార్తీక్ రావు స్థానిక నాయకులు సందీప్ ముదిరాజ్, చారి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Happy birthday Nimmala Santosh Rao