ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు ఆచరించే రంజాన్ నెల ఆరంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు
- టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
రంజాన్ దీక్షలు ప్రారంభం. సౌదీ అరేబియాలో (మార్చి 11 ) రంజాన్ చంద్రుడు కనిపించాడు. కనుక ఇక్కడ మొదటి రోజాను ఈ రోజు ఆచరిస్తారు. ఈ సందర్భంగా ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు ఆచరించే రంజాన్ నెల ఆరంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు మాట్లాడుతూ, ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెలల్లో రంజాన్ మాసం ఒకటి. ఇస్లామ్‌లో ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయిన వరకూ ఉపవాసం ఉండి.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. రోజా ముగిసిన తర్వాత ఈదుల్ ఫితర్ జరుపుకుంటారు. రంజాన్ పండుగ వెనుక మానవాళికి మంచి చేసే ఉద్దేశం ఉంది. ఇది క్రమశిక్షణను, దాతృత్వాన్ని, ధార్మిక చింతనను ప్రజలకు బోధిస్తుంది. ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్పుకుంటారు. అందుకే ఈ మాసం ముస్లింలకు అత్యంత పవిత్ర మాసం దేవినేని ఉమా అని చెప్పుకొచ్చారు. సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి నెలవంక కనిపించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఏటా జరుపుకొనే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఆదివారం రాత్రి నెలవంక దర్శనం ఇవ్వడంతో సోమవారం నుంచి ఉపవాసదీక్షలు మొదలవుతాయని తెలిపారు. ఏదేమైనప్పటికీ, ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుడి కాలచక్రంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉపవాస తేదీ సంవత్సరానికి మారుతుంది. ప్రారంభ, ముగింపు తేదీ నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది.
శాంతి, మార్గదర్శకత్వం కోసం ప్రార్థించడం, రంజాన్‌ను ‘రమదాన్’‘ఈద్ ఉల్ ఫిత్ర’ అని కూడా అంటారు. ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. దానధర్మాలు చేస్తారు. పండుగ అనేది ఓ మతానికి, కులానికి సంబంధించిందైనా దాని వెనుక అద్భుత సందేశం ఉంటుంది. అలాగే, రంజాన్ పండుగ వెనుక కూడా మానవాళికి మంచి చేసే ఉద్దేశం ఉంది అని ఉమా అన్నారు.