
Great leader “K.M.Pandu” Yadi in Qutbullapur
Trinethram News : “భవిష్యత్తు తరాలు బాగుండాలంటే అందరికీ విద్యా అందించాలి” అని నమ్మిన మహానేత కె.ఎం.పాండు : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …
ఈరోజు చింతల్ ప్రధాన రహదారిలోని స్వర్గీయ మహానేత, బాపు “కె.ఎం.పాండు” విగ్రహం వద్ద నిర్వహించిన కె.ఎం.పాండు 79 వ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పాల్గొని వారి నాన్నగారైన కె.ఎం.పాండు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మహానేత సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా మహానేత కె.ఎం.పాండు ని స్మరిస్తూ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మట్లాడుతూ ఇందిరా గాంధీ ప్రభుత్వంలో నాడు కుత్బుల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పాండు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ అయిన “జీడిమెట్ల పారిశ్రామిక వాడను ఏర్పాటుచేయించి అభివృధ్ధి చేసిన ఘనత పాండు కి దక్కుతుందన్నారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే అందరికీ విద్యా అందించాలని, నిరుపేదల విద్య కోసం అనునిత్యం తపించిన నాయకులు కె.ఎం.పాండు అని అన్నారు.
వారి ఆశయ సాధనలో భాగంగానే ఒకేషనల్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటుచేస్తామన్నారు. నేడు కుత్బుల్లాపూర్ లోని ఎంతోమంది నాయకులు కుత్బుల్లాపూర్ పాఠశాలలోనే విద్యనభ్యసించారన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మా నాన్న జయంతి సందర్భంగా నిరుపేద మహిళలకు ఉపాధి కల్పనలో భాగంగా కె.ఎం.పాండు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కుట్టు మిషన్లను పంపిణీ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ పార్టీల నాయకులు, కె.ఎం.పాండు అభిమానులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
