సెప్టెంబర్ 21, 2026
TRINETHRAM NEWS
Teej Celebrations

రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ ప్రతినిధులు…

Teej Celebrations : దేవరకొండ డివిజన్ ఆగస్టు 30, త్రినేత్రం న్యూస్. ఇంజాపూర్ బంజారా సంక్షేమ అసోసియేషన్ ఇచ్చిన ప్రత్యేక పిలుపు మేరకు కాలనీలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఇంజాపూర్ కాలనీవాసులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
​ఈ ఉత్సవాలకు రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు కేతావత్ బాబురామ్ నాయక్ అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు తుల్జా భవాని నగర్ మాజీ వార్డు సభ్యులు కొర్ర రమేష్, ప్రముఖ నాయకులు రామలింగం,కొర్ర. శంకర్, ఆనంద్, ప్రవీణ్, మోహన్,ఇతర వార్డు సభ్యులు మరియు పలువురు కాలనీ పెద్దలు అతిథులుగా పాల్గొన్నారు. సంస్కృతిని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం.
ఈ సందర్భంగా బాబురామ్ నాయక్ మాట్లాడుతూ.. బంజారా సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ఈ పవిత్రమైన తీజ్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
​ఈ కార్యక్రమంలో సంప్రదాయ దుస్తులు ధరించిన యువతుల నృత్యాలు, తీజ్ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం నిర్వాహకులు, కాలనీ పెద్దలు అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో ఇంజాపూర్ బంజారా సంక్షేమ సంఘం ప్రతినిధులు, కాలనీ మహిళలు, యువకులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page