సెప్టెంబర్ 21, 2026
TRINETHRAM NEWS
Dr. Ramulu Naik Statue

-పేదోడి డాక్టర్ గా ఎంతోమంది నిరుపేదలకు వైద్య సేవలు.

రమావత్ రవీంద్ర కుమార్. మాజీ శాసనసభ్యులు.

Dr. Ramulu Naik Statue : చందంపేట ఆగష్టు 30, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లో పేదోడి డాక్టర్ గా ప్రజల మన్ననలను పొందిన డాక్టర్ నేనావత్ రాములు నాయక్ ప్రథమ వర్ధంతి సందర్భంగా చందంపేట మండలం గన్నేర్లపల్లి గ్రామంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు బీ ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ మరియు బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యానాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ డాక్టర్ రామును నాయక్ చేసిన సేవలు మరువలేనివి అని, పేదోడి డాక్టర్ గా ఎంతో మంది నిరుపేదలకు వైద్య సేవలు అ ందించి వారి జీవితాల్లో చిరస్తాయిగా నిలిచారని కొనియాడారు. డాక్టర్ రాములు నాయక్ నేడు మన మధ్య లేకపోయినా ఆయన అందించిన వైద్య సేవలు ప్రజల కోసం చేసిన కృషి ఆయన జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా పదిలంగా ఉంటాయని రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు టీవీ అండ్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ నోకియా నాయక్ మర్త్య దేవేందర్ నాయక్ కేతావత్ హరిలాల్ వార్త్య బాలునాయక్ సర్పంచులు నేనావత్ భరత్ తులసిరామ్ కౌన్సిలర్ అజయ్, మాజీ కౌన్సిలర్ జయప్రకాష్, జైపాల్ నాయక్, నాగార్జున నాయక్, కిషన్ నాయక్ రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page