TRINETHRAM NEWS

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి పండగ వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి ప్రాముఖ్యతను గురించి తెలుపుతూ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సాంప్రదాయ బద్దంగా తెలుగుతనం ఉట్టిపడేలా, చక్కటి సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంలో భోగిమంటలు, రంగురంగుల ముగ్గులు మరియు బొమ్మల కొలువులు ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా విద్యార్థులు గాలిపటాలు ఎగురవేయడం సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగను మనం మూడు రోజులు జరుపుకుంటామని, మొదటి రోజు భోగి పండుగతో ప్రారంభమై, రెండవ రోజు సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడం వలన మకర సంక్రాంతి, మూడవ రోజున కనుమ రోజు పశువులను అలంకరించి వాటిని పూజించడం జరుగుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవింద్ రెడ్డి మరియు కోఆర్డినేటర్ నాగరాజు పాఠశాల డీన్ శ్యాంసుందర్, ఇన్చార్జులు, స్రవంతి, తస్స్లీం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App