TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 4 :నెల్లూరు జిల్లా: కావలి పట్టణంలోని స్థానిక ట్రంకు రోడ్డులోని తిరుమల జనరల్ స్టోర్స్, వద్ద ఉచిత మజ్జిగ,చల్లని మంచి నీరు చలివేంద్రాన్ని కావలి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ కావలి సహాయ వ్యవసాయ సంచాలకులు నాగరాజు,మరియు మండల వ్యవసాయ అధికారి, లలిత ప్రారంభించారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలం కావడంతో ప్రజల దాహార్తి తీర్చేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు,ప్రజలంతా నిత్యం అందుబాటులో ఉండే ఈచలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు,
ఈ కార్యక్రమంలో ఎరువులు పురుగుమందులు విత్తనాల అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు ఏడుకొండలరావు, ఉపాధ్యక్షులు నేరెళ్ల జ్వాలా సుబ్బారావు, సభ్యులు పేరూరు శివప్రసాద్, బీసు నాగ మోహన్ రావు,వెల్లంపల్లి మోహన్ రావు,సురె కృష్ణారెడ్డి, బచ్చు తేజ,రవి,వెంకట సురేష్, దేవరపల్లి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand opening of the cold