అక్టోబర్ 23, 2026
TRINETHRAM NEWS
Grand Celebration Palle Panduga

Grand Celebration Palle Panduga : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 01 ; గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా బీబీజీ రామ్‌జీ పథకం ద్వారా పోలవరం నియోజకవర్గానికి రూ.25 కోట్ల నిధులు కేటాయించడం సంతోషకరమైన విషయమని పోలవరం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు. కొయ్యలగూడెం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండలాల వారీగా కేటాయింపులు:
కొయ్యలగూడెం 25 సీసీ రోడ్లకు రూ.2.17 కోట్లు, అదేవిధంగ- బుట్టాయగూడెం 9 బీటీ రోడ్లకు రూ.4.05 కోట్లు. కుక్కునూరు … 9 బీటీ రోడ్లకు రూ.4.10 కోట్లు- వేలేరుపాడు 4 బీటీ రోడ్లకు రూ.1.85 కోట్లు,- పోలవరం 22 సీసీ రోడ్లకు రూ.2.45 కోట్లు,- టి.నర్సాపురం 9 బీటీ రోడ్లకు రూ.4.40 కోట్ల- జీలుగుమిల్లి 14 బీటీ రోడ్లకు రూ.6.30 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో నియోజకవర్గంలో మొత్తం 27.28 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 8.50 కిలోమీటర్ల సీసీ రోడ్లు నూతనంగా నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.
గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన రహదారులు, మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తూ,ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో అవసరమైన నిధులను తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పీఓ రాముల నాయక్, తహసిల్దారు నాగరాజు,ఎంపిడిఓ కిరణ్ కుమార్,కూటమి నాయకులు గొలిశెట్టి శ్రీనివాస్, గొలిశెట్టి వాసు, చెరువూరి శ్రీను, నాగేశ్వరరావు, మజ్జి చిరంజీవి, శివకుమార్, గంట రమేష్, గంట మురళి, మారిశెట్టి సాయి, పద్ధం వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page