
కడియం నర్సరీల సందర్శనకు రావాలని ఆహ్వానం..
Subbarayudu meets Pawan Kalyan త్రినేత్రంన్యూస్ కడియం నర్సరీల సందర్శనకు రావాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారాయుడు ఆహ్వానించారు. గురువారం వ్యక్తిగత పనుల నిమిత్తం విజయవాడ వెళ్లిన సుబ్బారాయుడుకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిసే అవకాశం లభించింది.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కడియం నర్సరీల గురించి సుబ్బారాయుడిని ఆశక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కడియం ప్రాంతంలో నర్సరీ రైతులు, నిర్వాహకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సుబ్బారాయుడు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నర్సరీ రంగం అభివృద్ధికి అవసరమైన అంశాలను వివరించారు.
అనంతరం కడియం నర్సరీల ప్రత్యేకతను ప్రతిబింబించే ప్రత్యేకమైన బోన్సాయి మొక్కను పవన్ కల్యాణ్‌కు సుబ్బారాయుడు అందజేశారు. కడియం నర్సరీలను స్వయంగా సందర్శించాలని పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. కడియం నర్సరీల గురించి పవన్ కల్యాణ్ ఆసక్తిగా వివరాలు తెలుసుకోవడం నర్సరీల సందర్శనకు సుబ్బారాయుడు ఆహ్వానించడం ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe