నవంబర్ 12, 2026
TRINETHRAM NEWS
Gram Panchayat Elections

నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్

Gram Panchayat Elections : పాడేరు,అరకులోయ నవంబర్ 13, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ఐఏఎస్ తెలిపారు. గురువారం పాడేరు కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్, ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.
జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఉన్న 244 గ్రామ పంచాయతీల్లో 244 సర్పంచ్, 2,446 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,98,467 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మొదటి విడతలో నవంబర్ 26న కొయ్యూరు, జి.కె.వీధి, చింతపల్లి మండలాల్లో; రెండో విడతలో నవంబర్ 29న అనంతగిరి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో; మూడో విడతలో డిసెంబర్ 2న అరకు, డుంబ్రిగూడ, హుకుంపేట, పాడేరు మండలాల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page