Godavarikhani OCP-5 should contribute to the welfare of workers’ families in the affected 33rd division
నూతనంగ విచ్చేసిన అర్జీ -1 జి.ఏం
లలిత్ కుమార్ గారిని కలిసిన మద్దెల దినేష్
ఉత్పత్తి, రక్షణ ఎంత ముఖ్యమో
సంక్షేమం కూడా అంతే ముఖ్యం
అర్జీ-1 జిఏం లలిత్ కుమార్.
గోదావరి ఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లోని అర్జీ-1 పరిధిలోని ఓసిపి-5 క్రింది ప్రభావిత 33వ డివిజన్ ప్రాంత కార్మిక కుటుంబాల మరియు ప్రజల బాధలు తీర్చాలని అర్జీ-1 జిఎం లలిత్ కుమార్ మర్యాద పూర్వకంగా 33వ డివిజన్ యువ నాయకులు సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ జి ఏం కొరారు.
శుక్రవారం రోజున అర్జీ-1 జిఎం కార్యాలయంలో జిఎం ఛాంబర్ లో ఇటీవల నూతనంగా విచ్చేసిన జిఎం మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందన్నారు.
అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ ఓసిపి-5 ప్రారంభం కాకముందు అప్పుడున్న అర్జీ-1 అధికారి ప్రభావిత గ్రామాలకు, డివిజన్ లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అమలులో మాత్రం నిర్లక్ష్యం చేసారని జిఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఓసిపి-5 శబ్ద కాలుష్యం, దుమ్ము ధూళి వల్ల డివిజన్ ప్రజలు అనారోగ్యానికి మరింత పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, రెండు నెలలకోసారి 33వ డివిజన్ లో సింగరేణి ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ వైద్యనిపణులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిఎం గారిని కోరామన్నారు.
అదే విధంగా ఓసిపి-5 క్రింది ప్రభావిత 33వ డివిజన్ అయినందు వల్ల డివిజన్ ప్రజలు కార్మికుల కుటుంబాలలో ముఖ్యంగా మహిళలు, పెద్దమనుషులు, దుమ్ము, ధూళితో శబ్దాలకు భయపడి షుగర్, బిపి, ఆయాసం శ్వాశకొస వ్యాధులతో మరియు ఇతరత్రా రోగాల బారిన పడుతున్నారని కావున డివిజన్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వెంటనే 33వ డివిజన్ లో ఓపెన్ జిమ్, మరియు పార్క్ లు మంజూరు చేయాలన్నారు.
అదే విధంగా 33వ డివిజన్ లో వీవిధ గల్లిల్లో సరైన వీధి లైట్లు లేక స్థానిక డివిజన్ కార్మికు కుటుంబాలు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు,వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని
సోలార్ లైట్లు ఏర్పాటు చేయలని కోరిన వెంటనే మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరొక 10 సోలార్ లైట్లు మంజూరు చేయాలన్నారు.
అదే విధంగా 33వ డివిజన్ లో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే మంజూరు చేసారని కానీ ప్రారంభించనికి జాప్యం జరగుతుందన్నారు. మరుమత్తులకు నోచుకోకుండా ఆన్న సింగరేణి కమ్యూనిటీ హాల్ త్వరిత గతంగా మరుమత్తులు చేసి కార్మిక కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
డివిజన్ లో సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని,
డ్రైనేజీ సమస్య కూడా తీవ్రంగా ఉందని దానిని కూడా పరిష్కరించాలని, నూతనంగా డ్రైనేజీ లైన్ నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
అదే విధంగా సింగరేణిలో ఏదైనా, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగాలలో అవకాశం ఉంటే ముందుగా 33వ డివిజన్ నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని జిఎం కోరామన్నారు.
డివిజన్ లో కొన్ని గల్లిలలో రోడ్లు పూర్తిగా చెడిపోయాయని, అదే విధంగా సింగరేణి క్వార్టర్ల ముందు రోడ్డు కూడా పూర్తిగా చెడి పోయిందని నూతన బిటి రోడ్డు వేయాలని, అదే విధంగా రెండు హ్యాండ్ బోరింగ్ లు వేయాలని విజ్ఞప్తి చేసామన్నారు. కావున ప్రభావిత ప్రాంతమైన 33వ డివిజన్ లో మరిన్ని కార్మికుల కుటుంబాల సౌకర్యార్థం కొరకు మరిన్ని అభివృద్ధి పనులు ప్రజల సౌకర్యార్థం కొరకు చేయాలని, కోరామని మద్దెల దినేష్ పేర్కొన్నారు.
కావున జిఎం లలిత్ కుమార్ సానుకూలంగా స్పందించి 33వ డివిజన్ లో మిరు అడిగినవన్నీ త్వరలో ఏర్పాటు చేపిస్తామని హామీ ఇచ్చారని దినేష్ తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జిఎం వెంట ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, వీర రెడ్డి గార్లు మరియు గాంగరపు ప్రసాద్, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App