TRINETHRAM NEWS

Godavarikhani is the second town police to crack a theft case in a short period of time

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

8వ కాలనీ గల పోతన కాలనీలో పోతన విగ్రహం వద్ద తన సమాచారం మేరకు వాహనాల తనిఖీ ఎస్సై వెంకటేష్ మరియు సిబ్బంది యుక్తంగా చేయుచుండగా ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై అనుమనాస్పద స్థితిలో వస్తుండగా పోలీసు వారిని చూసి అతను పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే ఎస్ఐ మరియు సిబ్బంది కొద్ది దూరంలో వెంబడించి అట్టి వ్యక్తిని పట్టుకొని అట్టి మోటార్ సైకిల్ కాగితాలు అడగగా అతను సరియగు సమాధానం చెప్పకపోవడంతో వెంటనే అతన్నిచారించగా అతను నాడు కదా తన యొక్క పేరు దురిశెట్టి స్వామి నిరంజన్ తండ్రి శంకర్ 35 సంవత్సరంలో పెరిక వృత్తి కూలీ కార్లు మార్క్స్ కాలనీ భూపాలపల్లి అని తెలిపి తను 2012లో డిగ్రీ పూర్తి చేసి జంసాలకు అలవాటు పడి డబ్బులు లేకపోవడంతో అప్పటినుండి దొంగతనాలు చేయుచు పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినాడు అట్టి వ్యక్తిపై 14 కేసులు కూడా కలవు. ఒక కేసులో భద్రాచలం పోలీస్ వారు అరెస్టు చేసి భద్రాచలం సబ్ జైలుకు పంపగా భద్రాచలం సబ్ జైలు నందు ఉన్నప్పుడు రవీందర్ అన్న తో పరిచయం కాగా అతను తన యొక్క భార్య 9 నెలల గర్భవతి అని తనని బెయిల్ మీద బయటకు తీసుకురావాలని చెప్పగా తన యొక్క మిత్రుడిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని నిర్ణయించుకొని అందుకు డబ్బులు ఖర్చు అవుతాయని దాంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకొని భద్రాచలం నుండి గోదావరిఖనికి తేదీ 9 రోజున రాత్రి వచ్చి మిలీనియం క్వార్టర్స్ లో రాత్రి నందు తాళం వేసి ఉన్న ఇంటిని పగలగొట్టి అందులో గల అందాల రెండున్నర తులాల బంగారు ఆభరణాలు మరియు రెండు తులాల వెండి దొంగతనం చేసుకొని కింద గల ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్ తీసుకొని అట్టి మోటార్ సైకిల్ పై కొత్తగూడెం వెళుచుండగా వరంగల్ శివారుకు వెళ్లేసరికి అట్టి మోటార్ సైకిల్ లో పెట్రోల్ అయిపోవడంతో హీరో హోండా ప్యాషన్ ప్రో ను అక్కడే వదిలేసి బస్సులో భద్రాచలంలో కొత్తగూడెం నందు ఫైనాన్స్ నందు కుదవపెట్టి అట్టి డబ్బులతో లాయర్లు మాట్లాడి రవీందర్ కు బెయలు వచ్చేలా చూసినారు అనంతరం డబ్బులు అయిపోవడంతో మరల దొంగతనం చేయాలని నిర్ణయించుకొని 14 వ తారీకు రోజున మంచిర్యాలకు వచ్చి మంచిర్యాల నుండి గోదావరిఖని 8వ కాలనీలో గల పోతన కాలనీకి వచ్చి పోతన కాలనీలోని సింగరేణి ఉద్యోగులు నివసించే క్వార్టర్ లు రెక్కీ చేసినాడు చాలా క్వార్టర్లు తాళం వేసి ఉండడంతో రాత్రి 12 గంటల ప్రాంతంలో క్వార్టర్ యొక్క తాళం పగలగొట్టి ఒక ఇంటిలో 5500 మరియు మరొక ఇంటిలో ఫాస్ట్ ట్రాక్ వాచ్, బ్లు టూత్ హెడ్ సెట్ మరియు 8 తులాల వెండి దొంగతనం చేసుకొని బయటకు వచ్చి కింద పార్కింగ్ చేసిన హీరో హోండా ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్ ను తీసుకొని అట్టి మోటార్ సైకిల్ మీద కొత్తగూడెం వెళ్ళుచు చుండ్రుగొండ వద్ద మోటార్ సైకిల్ పాడవడంతో మోటర్ సైకిల్ అక్కడే పడేవేసి కొత్తగూడెం వెళ్లి తన వద్ద గల డబ్బులు లో 2500 ఖర్చు చేసుకొని మిగతా డబ్బులు 2700 తన దగ్గర ఉంచుకొని మరల దొంగతనం చేద్దామని మోటార్ సైకిల్ మీద పోతన కాలనీకి రాగా పోలీసు వారు పట్టుకున్నారు.
ఇట్టి కేసును సాంకేతిక పరిజ్ఞానంతో అతి తక్కువ కాలంలో చేదించిన రెండవ పట్టణ ఎస్సై ఎస్ వెంకటేశ్, మరియు కానిస్టేబుల్ లు రమేష్ భార్గవ్, ప్రవీణ్ మరియు వెంకటేశ్ లను ప్రత్యేకంగా అభినందించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Godavarikhani is the second town police to crack a theft case in a short period of time