ఇల్లుకులింది నష్ట పరిహారం ఇప్పించండి
ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ పెనుమూరు మండలం.మండల ఇంచార్జ్.
పెనుమూరు మండలం గుడ్యా యానం పల్లి హరిజనవాడకు చెందిన చంద్రశేఖర్ సోమవారం కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల వేదికలో కలెక్టర్ సుమిత్ కుమార్ కు అర్జీ ఇచ్చారు. బాధితుడు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మా ఇంటి పై చెట్లు పడటం వల్ల ఇల్లు మొత్తం కూలిపోయింది. మాకు ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదు. అందరం వేరే వాళ్ళ ఇంట్లో తల దాచుకుంటున్నాం. నేను కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాను. కావున నా పరిస్థితి చూసి నష్టపరిహారం అందు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందిస్తూ పెనుమూరు మండల తాసిల్దార్ కు అక్కడ పరిస్థితి పరిశీలించి బాధితులు ఆదుకోవాలని ఆదేశించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App