అక్టోబర్ 23, 2026
TRINETHRAM NEWS
Girajala Babu

— వైయస్సార్ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు.

Girajala Babu : త్రినేత్రం న్యూస్మ : హాత్మ గాంధీ కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి సత్యం, అహింస, శాంతి సందేశాలను అందించిన మహోన్నత వ్యక్తి అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల బాబు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రమైన కడియంలో మహాత్ముని శిలా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గమే భారతదేశ అభ్యున్నతికి బాటలు వేసిందని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం, గ్రామ స్వరాజ్య సాధన కోసం గాంధీజీ జీవితాంతం కృషి చేశారని తెలిపారు. దేశ ప్రజలలో జాతీయ చైతన్యం నింపి స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. నేటి యువత మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత, క్రమశిక్షణ, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తేనే గాంధీజీకి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సాపిరెడ్డి కామేష్, సర్కార్ భాష, పున్నమి రాజు వీర్రాజు, బండారు శ్రీనివాస్, నాగిరెడ్డి మోహన్, ఉప్పులూరి తాతాజీ, కడియం గణేష్, పడాల సతీష్, మలకల సత్యం, గుత్తుల సత్తిబాబు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page