
General Secretary of Bar Association at Godavarikhani Bar Association Hall
గోదావరిఖని నేత్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జవ్వాజి శ్రీనివాస్ అధ్యక్షతన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ హైదరాబాద్ స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్యామ్ సన్ మరియు రాష్ట్ర నాయకులు కె నరేందర్, మల్లేష్ తో
తేదీ 25/08/2024 ఆదివారం రోజున మాసబ్ ట్యాంక్ హైదరాబాదులో OBC అడ్వకేట్స్ కన్వెన్షన్ వర్క్ షాప్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది
రాష్ట్ర నాయకులు నరేందర్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కానీ ఓబీసీలకు 60 శాతం కూడా ఇప్పటివరకు ఎటువంటి రిజర్వేషన్ల వాటా అందలేదన్నారు, ఇప్పటివరకు బీసీల సెన్సెస్ జరగలేదు. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెన్సెస్ పై దృష్టి సారించడం లేదని దీనివల్ల ఎంతోమంది అన్ని రంగాల్లో ఓబీసీ లకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుందని ఇట్టి విషయాన్ని ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్లి బీసీల సెన్సెస్ చేపట్టి వారికి వచ్చే రిజర్వేషన్ వాటాను వారికి అందే విధంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు మరియు ILPA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఓబీసీ అడ్వకేట్ కన్వెన్షన్ హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నామని దానికి రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు అధికంగా పాల్గొనాలని OBC లకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని వర్గాలకు తెలిసే విధంగా న్యాయవాదులు ముందుండి పోరాటం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవుటమ్ సతీష్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీ రామటేకి శ్రీనివాస్, మరియు మురళీధర్ యాదవ్, ము చ్చకుర్తి కుమార్, అరుణ్ యాదవ్, శీతకారిచంద్రశేఖర్, సిరిమల్లె అనిల్, సిరిమల్లె అవినాష్, పూర్మ శ్రీనివాస్, శైలజ, రాగం శ్రీధర్, గుర్రాల రాజేందర్, ముష్క రవి మరియు అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
