Trinethram News : Mar 09, 2024,
ఆ రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు!
రంగుల హోలీ పండుగ సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తీపికబురు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలకు పండుగ కానుకగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. దీపావళి సందర్భంగా రాష్ట్రంలో అర్హులైన వారికి 1.75 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఇప్పుడు హోలీకి కూడా ఇదే కానుకను ఇవ్వనున్నారు.