గంగుల అంజలి యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా మరియు షేక్ రఫియా బేగంను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి ప్రతిపాదించి తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత మొగిలి రావు నియమించినందున ఈ రోజు నియామక పత్రాలు అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. ఈ సందర్బంగా హన్మంత్ రెడ్డి మాట్లడుతూ రానున్న మహిళలని చైతన్యవంతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రతిఒక్క మహిళకు వివరించి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు పని చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు సుజాత యాదవ్, శ్రీలత, ఫరహీన్ బేగం, నాగ భవాని, శోభ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా గంగుల అంజలి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రఫియా బేగం నియామకం
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ
TRINETHRAM NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్. కే గార్డెన్స్ లో శనివారం రోజున పెద్దపల్లి నియోజకవర్గనికి సంబంధించిన…
ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి
TRINETHRAM NEWS ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి *ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి *వైద్యులు విధి నిర్వహణ సమయంలో ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలి *రామగుండం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రామగుండం, జనవరి -18…