
Fulfilling the aspirations of the people of Telangana state is the true tribute to the martyrs
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కాండి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరిఖని అమరవీరుల స్థూపం వద్ద సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఘనంగా నివాళులర్పించింది.
ఈ సందర్భంగా ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సకారం కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం సబ్బండ వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని సాధించుకున్న తెలంగాణలో మార్పు లేకపోగా తెలంగాణలో నేటికీ రాచరిక పాలన కొనసాగుతుందని నిన్నటి ప్రభుత్వమే టిఆర్ఎస్ తన కుటుంబ పాలనను తన ఆస్తుల పెరుగుదలను చూసుకున్నదే తప్ప నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఘోరంగా విఫలమైందన్నారు.
రాష్ట్రంలో పోరాడే ప్రజలపై ప్రజా సంఘాలపై వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల కోసం ఉద్యమాలు నిర్వహిస్తే తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని అణిచివేతను నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు జరిపిందన్నారు.
ఎన్కౌంటర్లు కుట్ర కేసులు సభలు సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛపై ఆంక్షలు విధించారు.నిజమైన తెలంగాణ కోసం పోరాడినటువంటి అనేకమంది ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారు పోరాడి సాధించుకున్న తెలంగాణ దొరల పాలయిందని ప్రజలు గ్రహించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదు తెలంగాణ స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ప్రజా ఉద్యమాలు విప్లవోద్యమమే మార్గమని ఈ సందర్భంగా అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్, డివిజన్ నాయకులు ఎం దుర్గయ్య, టౌన్ నాయకులు ఎం కొమరయ్య,ఎన్ సి బాబు, పెరక మొండయ్య, తిప్పని రాంకి, ఎడ్ల రవికుమార్,సదానందం,
AIFTU రాష్ట్ర నాయకులు జి రాములు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
