
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. సితాయిగూడెం మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీతాయిగూడెం మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్ అశ్వరావుపేట నియోజకవర్గ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు వేడుకలకు మాత్రమే పరిమితం కాదని మహిళల హక్కులను గుర్తిస్తూ వారు సాధించిన విజయాలను తెలియచేశారు.
మహిళలు ఎంతో మార్పు చెందిన ఈ ఆధునిక ప్రపంచంలో కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ అభివృద్ధికి తమ పాత్ర పోషిస్తూ కేంద్రబిందువులుగా నిలుస్తున్నారన్నారు. చరిత్రను పరిశీలిస్తే రాణి రుద్రమదేవి సావిత్రీబాయి ఫూలే ఇందిరాగాంధీ లాంటి అనేకమంది తమ ప్రతిభతో ధైర్యసాహసాలతో అంకితభావంతో ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
