
Trinethram News : సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్లపూర్‌లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
రంగనాయక సాగర్‌లోకి కాలేశ్వరం పంప్ హౌసుల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు
నా కోరిక మేరకు ఒక్క టిఎంసి నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు
గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తుంది.. ప్రజలకు నష్టం చేయకూడదు
SRSP స్టేజ్ 2లో తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి
SRSP నీరు తగ్గినప్పటికీ, కాలేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం
కాలేశ్వరంలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 23 కిలోమీటర్ల టన్నెల్లు బాగున్నాయి, 19 సబ్ స్టేషన్లు బాగున్నాయి, 21 హౌసులు బాగున్నాయి, ప్రెజర్ మైన్లు బాగున్నాయి
మేడిగడ్డలో ఏడు బ్లాకులు ఉంటే, అందులో ఒక్క బ్లాక్‌లో ఒక్క పిల్లర్ మాత్రమే కుంగిపోయింది
కానీ గోరంతను కొండంత చేసి బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేశారు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో మేడిగడ్డలో పొంగిన పిల్లర్లను బాగు చేసే తీరిక ప్రభుత్వానికి లేదు
నేడు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.. ఆ నీళ్లను లిఫ్ట్ చేసి లక్షల ఎకరాల పంటను కాపాడే అవకాశం ఉంది.
కేసీఆర్ మీద కోపంతోనే, బీఆర్ఎస్ మీద కోపంతోనే, తెలంగాణ రైతులకు అన్యాయం చేయకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నాం – హరీశ్ రావు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
