
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 5 : స్వాతంత్ర్య సమరయోధుడిగా,సంఘసంస్కర్తగా,తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పి జె ఆర్ నగర్ లో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి , మరియు డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ గార్ల విగ్రహాలకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్బంగా పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా ,సంఘ సంస్కర్తగా, తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డా౹౹ బాబూ జగ్జీవన్ రామ్ గొప్ప దార్శనికుడు అని, ఆయన సేవలు దేశము కోసం పడిన తపన ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అని, ఆత్మ విశ్వాసమే ఆయుధం గా దళితుల అభ్యున్నతి కోసం మరియు అణగారిన వర్గాల కోసం నిత్యం పాటుపడిన మహానుభావుడు , అఖండ భారత ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన స్వతంత్ర సమర యోధులు, ఆయన జయంతి ని భారతదేశంలో సమానత్వ దినోత్సవంగా జరుపుకుంటున్నామని. ఈ తరం ప్రజలకు ఆదర్శప్రాయం ఆయన జీవితం అని పి ఏ సి చైర్మన్ గాంధీ తెలియజేసారు.
అదేవిధంగా డాక్టర్ బాబు జగ్జివన్ రామ్ ఆదర్శవంతులు, నిబద్ధత సచ్చీలత, దళిత జనోద్ధరణ కృషీవలడు, స్వేచ్చ సమానత్వం, సామాజిక న్యాయం సౌభ్రాతుత్వం పై దేశ ప్రజలను చైతన్యం చేసి, నిమ్న వర్గాల నుండి ఉన్నత స్థానాలను అధిరోహించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ పరిపాలన దక్షత అనుభవాలు, సామాజిక న్యాయం కోసం ఆయన కృషిని గుర్తు చేసుకుంటూ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని. అలాగే చిన్న రాష్ట్రాల ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని డా. బిఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో చేర్చిన విషయాన్ని గుర్తుచేశారు. మహనీయుల ఆశయాలు నెరవేర్చే విధంగా అలాగే ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబు జగ్జివన్ రామ్ గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని, అదేవిధంగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన జీవిత ఆశయాల సాధన కోసం అందరం పునరకితం అవుదామని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, అభిమానులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
