TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ స్వామి పల్లకి సేవలో పాల్గొన్న వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు అనంతగిరి బండభావి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన స్వామివారి పల్లకి సేవా మరియు ప్రత్యేక పూజ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు* పాల్గొనడం జరిగింది. అనంతరం వికారాబాద్ పట్టణంలోని కొత్త గంజ్, హనుమాన్ ఆలయంతో పాటు పాత గంజ్, శివరాం నగర్ కాలనీ, ఎన్కెపల్లి గ్రామ పరిధిలో గల హనుమాన్ ఆలయాలలో జరిగిన స్వామివారి పల్లకి సేవా మరియు ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్న చైర్ పర్సన్ దంపతులు. వికారాబాద్ మున్సిపల్ మరియు పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్ధించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Chairperson in Sri Anjaneya