False news on Rahul and Sonia.. Case against Bangla journalist
Trinethram News : బెంగళూరు : Sep 3, 2024
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , ఆయన తల్లి, కాంగ్రెస్ అగ్రనేత సోనియాపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ కు చెందిన ఓ జర్నలిస్ట్ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, ఇండియాకు చెందిన ఓ న్యూస్ పోర్టల్ మహిళా సిబ్బందిపైనా ఎస్ఐఆర్ నమోదు చేశారు. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) నేత శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు జర్నలిస్టు సలా ఉద్దీన్ షోయబ్ చౌదరి, న్యూస్ పోర్టల్ మహిళా ఉద్యోగి అదితిపై హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
సోనియా గాంధీని విదేశీ గూఢచారి అంటూ బంగ్లాదేశ్ జర్నలిస్ట్ షోయబ్ చౌదరి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ పెట్టారని.. అలాగే, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ ను షేర్ చేశారని ఆయన ఆరోపించారు. అలాగే, రాహుల్ గాంధీపైన కూడా పలు ఆరోపణలు చేసినట్టు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా.. సలా ఉద్దీన్ షోయబ్, అదితిపై కేసు నమోదు చేసి ఎంక్వెరీ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App